FbTelugu

హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

హైదరాబాద్: హీరో రాం చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. తనకు వైరస్ సోకిందని రామ్ చరణ్ ప్రకటించారు. అయితే ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదని పేర్కొన్నారు.

ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని, త్వరలో కోలుకుని బయటకు వస్తానని ఆయన తెలిపారు. ఇంతకు ముందు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షల్లో లోపాల కారణంగా అయోమయం నెలకొన్న విషయం తెలిసింది. తొలుత పాజిటివ్ రాగా, మరో సారి పరీక్షించగా నెగెటివ్ వచ్చింది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. రోగం లేకున్నప్పటికీ పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టు రావడం పై అభిమానులు విస్మయం చెందారు. ఈ విషయాన్ని తన ట్విట్ ద్వారా చిరంజీవి స్వయంగా ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.