హైదరాబాద్: మాజీ ఎంపీ వి.హన్మంతరావు కు కరోనా పాజిటివ్ సోకింది. జ్వరం, జలుబు లక్షణాలు కన్పించడంతో ఆయన అపోలో హాస్పిటల్ లో చేరారు.
ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్ వచ్చిందని నిర్ధరించారు. ఇప్పటికే ముగ్గురు తెలంగాణ ఎమ్మెల్యేలకు ఈ వైరస్ బారినపడ్డారు. ప్రజలతో కలివిడిగా తిరగడం, ముందు జాగ్రత్త చర్యలు పాటించకపోవడం మూలంగా వైరస్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. వరుసగా నేతలకు కరోనా వైరస్ సోకుతుండడంతో మిగతా నాయకులు అప్రమత్తమయ్యారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.