FbTelugu

163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

కంటైన్మెంట్ జోన్ గా కాలేజీ
రాజమహేంద్రవరం: నగరంలోని ఒక కాలేజీలో ఏకంగా 163 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని వెల్లడికావడంతో మిగతా విద్యార్థులు కంగుతిన్నారు. అనుమానిత లక్షణాలు కన్పించడంతో తొలుత శనివారం ఈ కాలేజీలో 13 కేసులు బయటపడ్డాయి.
మరుసటి రోజైన ఆదివారం 10 కేసులు వెలుగుచూడగా, సోమవారం నాడు మరో 140 పాజిటివ్ కేసులు వచ్చాయి.

మొత్తం 700 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 163 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గౌరీ నాగేశ్వర రావు తెలిపారు. పాజిటివ్ విద్యార్థులను ఒకే ప్రదేశంలో ఉంచి, ఆ ప్రదేశాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని ఆయన చెప్పారు. కరోనా లేని విద్యార్థులను మరో హాస్టల్ లో ఉంచినట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లోని అనేక వసతిగృహాల్లో కరోనా వ్యాప్తి అధిక సంఖ్యలో ఉంది. ఉస్మానియా వర్సిటీతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో కరోనా జాడలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో విద్యాసంస్థల కొనసాగింపుపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.