FbTelugu

ఏపి కేసులు 22,164

అమరావతి: ఏపిలో కరోనా పాజిటివ్ కేసుల పెరుగుదల ఆగడం లేదు. గత 24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా 22,164 పాజిటివ్‌ కేసులు వెల్లడి అయ్యాయి.
శనివారం నాడు రాష్ట్రంలో 92 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్‌ తెలిపారు.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,87,603కి చేరగా, ఇప్పటి వరకు 8,707 మంది చనిపోయారు. కరోనా నుంచి 10,88,264 మంది కోలుకోగా.. 1,90,630 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మొత్తం 23,259 ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండగా 22,265 నిండినట్లు ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం 590 టన్నుల ఆక్సిజన్ కోటా కేటాయించిందని, ఆక్సిజన్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అనిల్ సింఘాల్ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.