FbTelugu

దేశంలో 58వేల కేసులే

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల వ్యవధిలో 58,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 81 రోజులు తరువాత 60వేల కన్నా తక్కువ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కొత్తగా 87,619 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,576 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 3,86,713 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 7,29,243 యాక్టివ్ కేసులు ఉండగా 27,66,93,572 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. ప్రస్తుతం రికవరీ రేటు 96.27 శాతం పెరగ్గా, వీక్లీ పాజిటిటివిటీ రేటు ఐదు శాతం కన్నా తక్కువగా అంటే 3.43 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 39.10 కోట్ల కరోనా నమూనాలు సేకరించారు. ఇందులో ఆర్.టి.పి.సి.ఆర్. ర్యాపిడ్ యాంటి జెన్ పరీక్షలు ఉన్నాయి. ర్యాపిడ్ యాంటి జెన్ పరీక్షలే 80 శాతం వరకు ఉండవచ్చనేది ఒక అంచనా.

You might also like

Leave A Reply

Your email address will not be published.