FbTelugu

ఏయిమ్స్ బిల్డింగ్ నుంచి దూకిన కరోనా పేషెంట్

ఢిల్లీ: కరోనా భూతం అన్ని రకాలుగా ప్రాణాలు తీస్తున్నది. వ్యాధి వస్తుందనే భయంతో కొందరు చనిపోతుండగా, వ్యాధి వచ్చి మరికొందరు చనిపోతున్నారు.

తాజాగా ఢిల్లీలో ఒక వ్యక్తి చనిపోతానేమోనన్న భయంతో భవనం పై నుంచి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా పాజిటివ్ తో ఒక వ్యక్తి ఏయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరాడు. చికిత్స చేయించుకుంటున్న అతను ఒత్తిడితో బాధపడుతున్నాడు. చనిపోతానేమోనన్న భయం వెంటాడడంతో అతను ఏయిమ్స్ బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి మిగతా రోగులు భయాందోళనకు గురయ్యారు.

You might also like