FbTelugu

600 మంది చిన్నారులపై కరోనా పంజా?

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో కేవలం రెండు రోజుల వ్యవధిలో సుమారు 600 మంది చిన్పపిల్లలు అస్వస్థకు గురయ్యారు. ఇంత పెద్ద ఎత్తున అస్వస్థతతకు గురి కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేశారు.

చిన్నారులకు వైరస్ రావడంత థర్డ్ ప్రారంభమైందనే భయం మొదలైంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. దౌసా లోని సిక్రై సబ్ డివిజన్ లో ఒక గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు కరోనా లక్షణాలతో బాధపడుతుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించారు. లక్షణాలు గమనించి వైద్యులు పరీక్షించగా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఇటీవలే తండ్ర కరోనా బారిన పడి చనిపోయారు. తండ్రి నుంచి పిల్లలకు సోకి ఉండవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 21వ తేదీ మధ్య 18 ఏళ్ల లోపు 241 మందికి కరోనా సోకింది. దుంగార్ పూర్ లో కూడా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెల 12 నుంచి 22వ తేదీ మధ్య 255 మంది చిన్నారులు పాజిటివ్ నిర్థారణ కావడంతో తల్లిదండ్రులు గుబులు పడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.