FbTelugu

పరీక్షలు జరిపితే 80 లక్షల మందికి కరోనా

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

అమరావతి: ఏపిలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షలమంది కరోనా బారిన పడే ప్రమాదముందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆందోళన చెందారు.

దేశంలో అనేక రాష్ట్రాలు పరీక్షల రద్దు లేదా వాయిదా వేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నాయని అన్నారు. కాని ఏపిలోని వైసిపి ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించాలని చూస్తోందని లోకేశ్ మండిపడ్డారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల వాయిదాకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలతో ఆన్ లైన్ సమావేశాన్ని లోకేశ్‌ నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరితో విద్యార్థుల జీవితాలకే పరీక్ష పెడుతోందని లోకేశ్‌ ఆరోపించారు. ఇప్పటికైనా విపత్కర పరిస్థితులను చూసి ప్రభుత్వం మొండిపట్టు వీడాలని లోకేష్ సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.