FbTelugu

మోదీ మాటలతో కరోనా పోదు?: రాహుల్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అర్థంపర్థం లేని మాటలు, డైలాగ్ లతో కరోనా పోదని, ఆయన ముచ్చట్లతో కరోనాతో పోరాడ లేమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.

మన్ కీ బాత్ పేరుతో ప్రతి వారం అక్కరకు ముచ్చట్లు ప్రధాని చెప్పడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పనికిరాని మాటలతో దేశాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చారన్నారని రాహుల్ ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఇప్పటి వరకు ప్రధాని మోదీ 77 సార్లు మన్ బాత్ కార్యక్రమం ద్వారా ప్రసంగించారు. ఈసారి యాస్, టౌటె తుఫాన్ పాటు ఆర్మి, నేవి, ఏయిర్ ఫోర్స్ సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ మాట్లాడారు. సరైన వ్యక్సిన్ ప్రణాళిక ఉన్నట్లయితే సెకండ్ వేవ్ వచ్చేది కాదని, ఇంత మంది చనిపోయేవారు కాదని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు తూర్పారపడుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.