FbTelugu

కుటుంబాన్ని బలి తీసుకున్న కరోనా…

విజయవాడ పాతబస్తీలో విషాదం

విజయవాడ: విజయవాడ పాతబస్తికి చెందిన న్యాయవాది కుటుంబంలో కరోనా వైరస్  విషాదం నింపింది. వరుసగా నలుగురు కుటుంబ సభ్యులు పాజిటివ్ తో పోరాడి మరణించారు.

పాతబస్తీ చెందిన న్యాయవాది తునుగుంట్ల దినేష్(37) ఇవాళ కరోనాతో మృతి చెందారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున దినేష్ తండ్రి ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల క్రితం కరోనాతో దినేష్ తల్లి, బాబాయ్ కన్నుమూశారు. వరుసగా ఒకరి తరువాత మరొకరు కుటుంబంలో అందరూ చనిపోవడంతో పాతబస్తీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

డేంజర్ జోన్ గా బెజవాడ పంజా సెంటర్..

పంజా సెంటర్ లో ఒకే ప్రాంతంలో 45 మందికి కోవిడ్ పాజిటివ్ సోకింది. ఇదే ప్రాంతంలో పదుల సంఖ్యలో హలీం సెంటర్లు ఉన్నాయి. 45 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. నియంత్రణా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

haleem centersadvocate dinesh

vijayawada old city

asd

You might also like

Leave A Reply

Your email address will not be published.