FbTelugu

కరోనా వ్యక్తి అంత్యక్రియలపై స్పందించిన ఈటల

హైదరాబాద్: గాంధీలో కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలను అధికారులు నిర్వహించడం పట్ల మంత్రి ఈటల స్పందించారు. మృతుని కుటుంబీకులంతా ఆస్పత్రిలోనే ఉండడంతో భార్యకు తెలిస్తే షాక్ లోకి వెళ్లే ప్రమాదం ఉందనే చెప్పలేదని తెలిపారు.

వాళ్ల ఆరోగ్యం కుదుట పడ్డాక ఇలా మాట్లాడడం సరికాదన్నారు. ఆస్పత్రిలో చేరిన 23 గంటల్లోనే ఈశ్వరయ్య చనిపోయాడని తెలిపారు. ఆయన కుమారుడు అదేరోజు ఆస్పత్రిలో చేరి 1వ తేదీన మృతి చెందినట్టు తెలిపారు. అప్పుడు మృతదేహాన్ని ప్రీజర్ లో పెట్టే పరిస్థితి లేదని అన్నారు. అతని మృతి గురించి పోలీసులకు తెలిపినట్టు తెలిపారు. మొదట్లో కరోనాతో మృతిచెందిన వారిని దహనం చేయడానికి అధికారులు భయపడ్డారని అన్నారు.

You might also like