FbTelugu

కరోనా మరణాలనే దాచేసిన హాస్పిటల్

డెహ్రడూన్: ఒక ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా కరోనాతో చనిపోయిన 65 మంది వివరాలు పొక్కకుండా దాచిపెట్టింది. ఈ వివరాలను ప్రభుత్వానికి తెలియచేయకుండా గోప్యంగా వ్యవహరించింది.

ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉన్యాల్ స్పందించారు. ఉద్దేశపూర్వకంగా కరోనా మృతుల లెక్కలు, వివరాలు దాచిపెట్టిన బర్ఫానీ హాస్పిటల్ పై సమగ్ర విచారణ జరిపి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు వెళ్లి తనిఖీ చేయగా సిబ్బంది కొరత కారణంగానే ప్రభుత్వం తో లెక్కలు పంచుకోలేకపోయామని బుకాయిన్నదని ఆయన అన్నారు. రెండు వారాల వ్యవధిలో 65 మంది పాజిటివ్ రోగులు చనిపోయారు. వాస్తవానికి రోగి మరణించిన తరువాత 24 గంటల వ్యవధిలో వైద్య, ఆరోగ్య శాఖ కంట్రోల్ రూమ్ కు వివరాలు పంపించాలి. కుంభ మేళా తరువాత ఉత్తరాఖండ్ లో కేసులు, మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోయిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.