FbTelugu

కరోనా మందంటూ.. కుటుంబం మొత్తానికి విషమిచ్చాడు

ఢిల్లీ: ఓ వ్యక్తి సినీ ఫక్కీలో ఓ కుటుంబం మొత్తాన్నే కడతేర్చాలని చూసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని అలీపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. ఓ వ్యక్తి తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆ కుటుంబం మొత్తాన్నే కడతేర్చాలని మాస్టర్ ప్లాన్ వేశారు. ఢిల్లీలో కరోనా కేసులు తీవ్రంగా ఉండడంతో కరోనాను పావుగా వాడుకోవాలని ప్లాన్ వేశారు.

ఇద్దరు మహిళలను పంపి కరోనా మందంటూ వారికి విషం ఇప్పించాడు. అది నిజమేనని నమ్మి వారు దాన్ని తాగేశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. బాధితులు ఈ విషయం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ మహిళలను, పంపిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఈ పని చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.