FbTelugu

అమ్మో.. అంత తిన్నారా!

కరోనా విజృంభిస్తోంది. మొదటి వేవ్‌ తగ్గుతుందనుకుంటున్న సమయంలో సెకండ్‌ వేవ్‌ మొదలైంది. ఇటీవల కాలంలో ఫంక్షన్లు ప్రారంభం కావడంతో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీటినుంచి తప్పించుకోవాలంటే న్యూ ఇయర్‌ వేడుకలను ఇళ్లలోనే చేసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. బయట సామూహికంగా చేసుకునే వేడుకలను రద్దు చేసింది. అయినా, జనం ఇళ్లలోనే భారీగానే వేడుకలను జరుపుకున్నారు. ఈ వేడుకల సందర్భంగా ఎక్కువ మంది భోజనాలను ఆన్‌లైన్‌లోనే తెప్పించుకున్నారు. తెప్పించుకోవడమంటే అట్టా ఇట్టా కాదు. ఆన్‌లైన్‌ ఆర్డర్లు ఎన్ని వచ్చాయనే విషయం చెబితే మైండ్‌బ్లాంక్‌ అవుతుంది.

ఇంతకీ ఎన్ని ఆర్డర్లు వచ్చాయనేగా మీ అనుమానం. ఒకటి కాదు.. రెండు కాదు నిమిషానికి ఏకంగా 4,100 ఆర్డర్లు వచ్చాయట. అది కూడా ఒక్క జొమాటా నుంచే. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదండీ.. జొమాటో సీఈఓ దీపీందర్‌ గోయలే ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఏడాది సందర్భంగా ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్లు భారీగా పెరిగాయట. ఒక్క డిసెంబర్‌ 31వ తేదీ నాడే నిమిషానికి 4,100 ఆర్డర్లు వచ్చాయని చెప్పాడు. ఇందులో కూడా ఎక్కువ ఆర్డర్లు వచ్చినవి పిజ్జాలు, బిర్యానీలేనట. నూతన సంవత్సర వేడుకల్లో తనమునకలైన వారు భోజనానికి బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదని.. అందుకే ఇంటికే తెప్పించుకున్నారని.. దీంతో భారీగా ఫుడ్‌ ఆర్డర్లు వచ్చాయట. ఏదైతేనేం కొత్త ఏడాది పేరుతో తనకిష్టమైన ఫుడ్‌ను ఎంచక్కా లాగించేశారన్న మాట.

You might also like

Leave A Reply

Your email address will not be published.