FbTelugu

భారత్ లో విజృంభిస్తోన్న కరోనా

న్యూఢిల్లీ: భారత్ కరోనా వైరస్ రోజురోజుకి తీవ్రంగా విజృభిస్తోంది. నేటికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 1,98,706 కి చేరింది. ప్రస్తుతం దేశంలో మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య 97,581 గా ఉంది.

ఈ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య నేటికి 95,526 కు చేరింది. నేటి వరకు ఈ మహమ్మారి దాటికి దేశంలో మొత్తం 5,598 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదౌతున్నాయి.

You might also like