FbTelugu

9ఆసుపత్రులు తిరిగి కన్నుమూసిన నవ వధువు

భువనేశ్వర్: కరోనా బారిన పడిన నవ వధువుకు మంచాలు లేవంటూ తొమ్మిది ఆసుపత్రులు నిరాకరించకడంతో చివరకు ఆమె అంబూలెన్స్ లోనే ప్రాణాలు విడిచిన హృదయ విదారక ఘటన ఒడిశాలో చోటు చేసుకున్నది.

భువనేశ్వర్ సమీపంలోని బల్లిపట్నా గ్రామవాసి విష్ణుతో స్వర్ణలత (25)కు ఇటీవలే పెళ్లి జరిగింది. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో వైద్యులు ఇచ్చిన గోళీలు వేసుకుంటున్నది. జ్వరం తగ్గకపోగా, ఆరోగ్యం క్షీణించడంతో భర్త శనివారం నాడు బల్లిపట్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకువెళ్లాడు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని, కటక్ తీసుకువెళ్లాలని వైద్యులు సూచించగా అక్కడికి అంబూలెన్స్ లో తీసుకువెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఇక్కడ వైద్యం చేయడం ప్రమాదమని వెంటనే భువనేశ్వర్ తీసుకువెళ్లాలని చెప్పారు. కటక్ వైద్యుల సూచన మేరకు భువనేశ్వర్ వెళ్లిన ఆమెకు మంచం ఇచ్చేందుకు ఏ ఒక్క ఆసుపత్రి ముందుకు రాలేదు. కరోనా పాజిటివ్ రిపోర్టు ఉంటే తప్ప చేర్చుకునేది లేదని తెగేసి చెప్పారు. ఏయిమ్స్ తో సహా తొమ్మిది ఆసుపత్రులు చేర్చుకోకపోవడంతో తిరిగి మళ్లీ బల్లిపట్నాకు తీసుకువచ్చారు. వైద్యం చేసేందుకు వైద్యులు నిరాకరించడంతో మళ్లీ ఆమెను భువనేశ్వర్ వెళ్లేందుకు అంబూలెన్స్ లో బయలు దేరారు. అయితే మార్గమధ్యంలోనే ఆరోగ్యం విషమించి స్వర్ణలత ప్రాణాలు కోల్పోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.