FbTelugu

విందు లో 103 మందికి కరోనా సోకింది

బెంగళూరు: ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లో జరిగిన విందులో పాల్గొన్న వారికి కరోనా పాజిటివ్ సోకింది. ఒకరికి కాదు ఇద్దరికి కాదు ఏకంగా 103 మందికి పాజటివ్ రావడంతో అపార్ట్ మెంటు వాసులు కంగుతిన్నారు.
మిగతావారికి విస్తరించకుండా ఉండేందుకు అపార్ట్ మెంట్ ను కంటైన్మెంట్ జోన్ గా బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ (బీబీఎంసీ) ప్రకటించింది. బొమ్మనహళ్లిలోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ లో ఫిబ్రవరి 4వ తేదీన ఒక విందు జరిగింది. ఆ విందులో అందులో ఉంటున్నవారిలో కొందరు పాల్గొన్నారు. ఆ తరువాత వారిలో పది మంది డెహ్రాడూన్ వెళ్లేందుకు కరోనా టెస్టులు చేయించుకోగా అందరికీ పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. ఈ విషయాన్ని అపార్ట్ మెంటులో ఉంటున్నవారికి తెలపగా అందరూ చేయించుకున్నారు.

మొత్తం 1052 మంది పరీక్షలు చేయించుకోగా 103 మందికి పాజిటివ్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే బృహత్ బెంగళూరు మహానగర పాలిక సంస్థ కు తెలియచేశారు. పాజిటివ్ వచ్చిన వారిలో ఒకరు ఆసుపత్రిలో చేరగా మిగతావారు హోం ఐసోలేషన్ లో పెట్టినట్లు బీబీఎంసీ కమిషనర్ మంజునాథ్ ప్రకటించారు. 1052 మందిని క్వారంటైన్ లో పెట్టామని, గట్టి నియంత్రణ చర్యలు తీసుకున్నామన్నారు.
కాగా పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారిలో చాలా మందికి ఎలాంటి లక్షణాలు కన్పించలేదని ఆయన వెల్లడించారు. అపార్ట్ మెంట్ వాసులకు కావాల్సిన నిత్యావసర సరకులను అందిస్తున్నామన్నారు. పూర్తి నివేదిక కోసం నమూనాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ హెల్త్, న్యూరో సైన్సెస్ కు పంపించామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.