FbTelugu

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా గడిచిన 24 గంటల్లో 920 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 11,364 కేసులు నమోదు కాగా, 6446 మంది చికిత్స పొందుతున్నారు. ఈ రోజు 327 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు మొత్తం 4688 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ కరోనాతో 5 గురు మృతిచెందగా, ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 230. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 737 కరోన కేసులు నమోదు అయ్యాయి. మిగతా కేసులు జిల్లాల్లో వచ్చాయి.

కేసులు పెరగుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిలిపివేసింది. అదేమంటే సేకరించిన నమూనాలు పరీక్షించడానికి కొద్ది రోజులు పడుతుంది, అప్పటి వరకు నమూనాలు సేకరించడం వృధా అని ప్రభుత్వం ప్రకటించింది. సేకరించిన నమూనాలు 48 గంటల్లో పరీక్షించాల్సి ఉంటుందని పేర్కొంది.

You might also like