FbTelugu

రాజమండ్రి సెంట్రల్ జైలులో కరోనా కలకలం

తూర్పుగోదావరి: రాజమండ్రి సెంట్రల్ జైలులో మళ్లీ కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా మరో 10 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు సెంట్రల్ జైలులో 52 మందికి కరోనా సోకింది.

ప్రస్తుతం సెంట్రల్ జైలులో మొత్తం 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉన్నారు. జైలులో ఉన్న 28 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇంకా 900 పరీక్షల రిపోర్టులు పెండింగ్ లో ఉన్నాయి. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగిపోతున్న నేపథ్యంలో జైలులో మూలాఖత్ ను అధికారులు నిలిపివేశారు.

You might also like