FbTelugu

గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం

గుంటూరు: జిల్లాలో మరోసారి కరోనా వైరస్ కోరలు చాచడం తో ప్రజలు కంగారు పడుతున్నారు. గతేడాది వచ్చిన కరోనాతో విలవిల్లాడిన జిల్లా, సెకెండ్ వేవ్ లో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.

రద్దీ పెరగడం వల్ల కరోనా పరీక్షలు చేయలేక అధికారులు చేతులెత్తేశారు.

కరోనా లక్షణాలతో వచ్చిన వారందరికీ పరీక్షలు చేయడం అధికారుల వల్ల కావడం లేదు. ఇప్పటికే 10వేల పరీక్షల ఫలితాలు పెండింగ్ లో ఉన్నాయి. తాకిడి తట్టుకోలేక నిన్నంతా పరీక్షలు చేయడం నిలిపేశారంటే దుస్థితి ఊహించు కోవచ్చు. చేసేది లేక

లక్షణాలున్న ప్రజలంతా హోం ఐసొలేషన్ లో ఉండాలంటూ బోర్డులు పెట్టేశారు.

మరోవైపు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కు పరుగులు పెడుతున్నారు. ప్రజల నుంచి విమర్శలు రావడం తో అదనంగా మరో 5 సెంటర్లు ఏర్పాటుచేసి, సిబ్బందిని నియమించి పరీక్షలు చేయడానికి సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం గుంటూరులో పరిస్థితి ఎలా ఉందంటే, ప్రతి 4 టెస్టుల్లో ఒక పాజిటివ్ బయట పడుతోంది. ఈ లెక్క చూసిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోతోందని గ్రహించి, పాక్షిక లాక్ డౌన్ విధించింది. గుంటూరులో 15 రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. సాయంత్రం 6 తర్వాత అన్ని షాపులు మూసేయాల్సిందే. ఇక 25వ తేదీ నుంచి రాత్రి 7.00 గంటల నుంచి ఉదయం 5.00 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.