FbTelugu

బ్రెజిల్ లో కరోనా విలయతాండవం

బ్రాసిలియా: బ్రెజిల్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్నది. నిన్న ఒక్కరోజే బ్రెజిల్ లో కరోనాతో 3,251 మంది మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాల్లో రెండో స్థానంలో ఉన్నది.

అమెరికా తరువాతి అత్యధిక మరణాలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పటి వరకు మూడు లక్షల మంది చనిపోయారు. గతం వారం రోజులుగా ప్రతిరోజు సగటున 2,273 మంది చనిపోతున్నారని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసులు అమాంతం పెరగడంతో హాస్పిటళ్లలో ఐసీయూ బెడ్ల కొరత అధికంగా ఉంది. డిమాండ్ కు తగిన విధంగా బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. వైరస్ ఉధృతిని తగ్గించేందుకు దేశంలో 212 మిలియన్ల ప్రజలకు వ్యాక్సిన్ మొదటి డోస్ ఇచ్చారు. మొత్తం జనాభాలో ఆరు శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.