FbTelugu

కరోనాకు మాత్రలు వచ్చేశాయి…

హైదరాబాద్: ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ కరోనా పాజిటివ్ రోగులకు ట్యాబెట్లను విడుదల చేసింది. ఇప్పటికే కరోనా రోగుల చికిత్స కోసం కోవిఫర్ వయాల్స్ (ఇంజెక్షన్) విడుదల చేసిన విషయం తెలిసిందే.
తాజాగా కరోనా పాజిటివ్ రోగుల కోసం ఫావివిర్ అనే ట్యాబ్లెట్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.

ఇవి గురువారం నుంచి అన్ని మెడికల్ షాపులలో అందుబాటులోకి రానున్నాయని హెటిరో ప్రకటించింది. ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ.59 గా నిర్ణయించింది. మార్కెటింగ్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి కూడా పొందామని పేర్కొంది. వైద్యులు ఇచ్చే మందు చీటి ఆధారంగా వీటిని దుకాణదారులు విక్రయించనున్నారు.

You might also like