FbTelugu

‘‘కరోనా ఫ్రీ దేశం’’ చెప్పిన మంత్రికే వైరస్

ఖాఠ్మాండు: నెపాల్ దేశం కరోనా ఫ్రీ దేశం అని ప్రకటించిన ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి యోగేష్ భట్టారాయ్ కు కరోనా నిర్థారణ అయ్యింది. తనకు కరోనా సోకిన విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడం విశేషం.

నేపాల్ దేశ ప్రభుత్వ మంత్రివర్గంలో కరోనా వైరస్ సోకిన తొలి మంత్రి కూడా ఆయనే. ఇప్పటికే ప్రధాన మంత్రి కేపీ.శర్మ ఓలీకి అత్యంత సన్నిహితుల్లో 8 మందికి వైరస్ నిర్థారణ అయ్యింది. దీంతో ప్రధాని కూడా హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కరోనా వైరస్ నీడ లేకుండా నేపాల్ స్వేచ్ఛగా ఉందనే విషయాన్ని ప్రపంచానికి తెలియచేయాలి అని గత ఫిబ్రవరి లో మంత్రి యోగేష్ తెలిపారు. ఒక రోజు క్రితం లక్షణాలు కన్పించడంతో ఆయన కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, వైరస్ సోకినట్లు వెల్లడైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.