FbTelugu

తెలంగాణ హోంమంత్రికి కరోనా

తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీకి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొద్దిరోజులుగా కరోనా లక్షణాలు కనిపిస్తుండడంతో హోం క్వారంటైన్‌లో ఉన్న ఆయనకు ఆదివారం రాత్రి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

దీంతో నిన్న రాత్రి అపోలో ఆసుపత్రిలో చేరి ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే, ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు కరోనా సోకింది.

You might also like