FbTelugu

సచివాలయ ఉద్యోగులకు కరోనా…

హైదరాబాద్: నిన్న తెలంగాణ సీఎంఓ లో కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా తాజాగా బీఆర్ కేఆర్ భవన్ లో సచివాలయంలో పనిచేస్తున్న ఇద్దరికి సోకింది.

ఫైనాన్స్ విభాగంలో తండ్రీకొడుకులకు పాజిటివ్ సోకినట్లు వార్తలు రావడంతో సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బిక్కుబిక్కుముంటున్నారు. వారిద్దరి నుంచి ఇంకా ఎంత మందికి అంటుకున్నదో అనుకుంటూ చర్చించుకుంటున్నారు.

దీంతో ఏడవ అంతస్తులోని ఫైనాన్స్ విభాగంలో పనిచేసే ఉద్యోగులు విధులకు హాజరు కావద్దని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ అంతస్తులో పనిచేసే వారు హోం క్వారంటైన్ లో ఉండాలని స్పష్టం చేశారు. ఈ అంతస్తులో మొత్తం 50 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. శానిటైజేషన్ పనులు ప్రారంభించారు.

జీహెచ్ఎంసీ ఉద్యోగికి కరోనా…

పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాలుగవ అంతస్తులో పనిచేస్తున్న ఉద్యోగికి పాజటివ్ రావడంతో ఆ అంతస్తులో పనిచేస్తున్నవారు భయపడుతున్నారు. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నవారికి ఇంటికి పంపించారు. హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఆ అంతస్తు మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.