FbTelugu

దేశంలో 18 కోట్ల మందికి కరోనా వచ్చి తగ్గింది

ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా ఉన్నట్టుగా థైరో కేర్ సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిపింది. ఇప్పటికే దేశంలో 18 కోట్ల మందికి కరోనా వచ్చి తగ్గిందని అంచనా వేసింది. 60 వేల మంది నుంచి నమూనాలు సేకరించినట్టు తెలిపింది. ఢిల్లీలో కరోనా వ్యాప్తి పట్ల జూన్ 27 నుంచి జులై మధ్య థైరో కేస్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా ఢిల్లీలో 21,387 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి విశ్లేషించినట్టు తెలిపారు. వారిపై కోవిడ్ కవచ్ ఎలీసా టెస్టులు నిర్వహించినట్టు తెలిపారు. 23.48 శాతం ప్రజల్లో కరోనా యాంటీ బాడీస్ ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిపారు. కరోనా వచ్చి తగ్గిన వారిలో మాత్రమే యాంటీబాడీస్ ఉన్నట్టు గుర్తించారు.

You might also like