FbTelugu

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. వివరాల్లోకెళితే.. నిజామాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాకు కరోనా సోకినట్టుగా అధికారులు వెల్లడించారు. రెండు రోజులుగా కరోనా లక్షణాలతో ఉన్నారు.  దీంతో కరోనా పరీక్షలు చేయగా పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. వెంటనే హోం క్వారంటైన్ కు వెళ్లారు.

దీంతో తెలంగాణలో కరోనా బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరినట్టైంది. మొదట జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకింది. ఆ తర్వాత నిన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కి కరోనా సోకింది.

You might also like