FbTelugu

ఒక పెళ్లి… 95 మందికి కరోనా

పాట్నా: నిబంధనలను పాతరేసి అంగరంగ వైభవంగా పెళ్లి నిర్వహించారు. 95 మందికి కరోనా వైరస్ సోకగా, పెళ్లైన రెండు రోజులకే వరుడు పాజిటివ్ తో చనిపోయాడు.
పాలిగంజ్ గ్రామానికి చెందిన యువకుడు గురుగ్రామ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలు కన్పించినా ఏమాత్రం పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ నెల 15వ తేదీన భారీ జనం మధ్య పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన రెండు రోజులకే వరుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పాట్నాలోని ఏయిమ్స్ కు తరలించారు. అయితే మార్గ మధ్యలోనే వరుణు ప్రాణాలు విడిచాడు.

కరోనా పాజిటివ్ విషయం బయటకు ఎక్కడ పొక్కుతుందోనన్న భయంతో తల్లిదండ్రులు గుట్టుచప్పుడు కాకుండా దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు అప్రమత్తమై, పెళ్లికి హాజరైనవారి వివరాలు సేకరించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 95 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే పెళ్లి కుమార్తెకు మాత్రం నెగెటివ్ రావడంతో వధువు తరఫువారు ఊపిరిపీల్చుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.