FbTelugu

93వేల రైల్వే ఉద్యోగులకు కరోనా కాటు

న్యూఢిల్లీ: దేశంలో 93వేల మంది రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ వెల్లడించారు. గత కొద్ది రోజుల నుంచి ఈ వ్యాధి తీవ్రమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

బారిన పడ్డ రోగులకు 72 ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నామని, 5వేలకు పైగా మంచాలను సిద్ధం చేశామన్నారు. తీవ్రత తక్కువగా ఉన్న ఉద్యోగులను హోం ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నామన్నారు. రైల్వేలో ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన డ్రైవర్లు, మెయింటెనర్స్, టిటిఈలు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, శానిటేషన్ సిబ్బంది విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నామని సునీత్ శర్మ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.