FbTelugu

అనాధాశ్రమంలో 79మందికి కరోనా?

యాదాద్రి: చౌటుప్పల్ లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో కరోనా కల్లోలం కలకలం సృష్టిస్తున్నది. ఆశ్రమంలో ఉన్న 79 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

అనాథ ఆశ్రమంలో సుమారు 400 మంది ఉంటున్నారు. వీరిలో కొందరికి లక్షణాలు కన్పించగా పరీక్షలు చేయించారు. ఇప్పటి వరకు 79 మందికి సోకినట్లు రిపోర్టులు వచ్చాయి. మిగతా వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు పూర్తయితే బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో వీరికి చికిత్స నిర్వహించడం కష్టంగా మారిందంటుని ఆనాథ ఆశ్రమం నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ప్రత్యేక చొరవ చూపించాలని బాధితులు కోరుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.