FbTelugu

ఒకే జైలులో 72మంది ఖైదీలకు కరోనా

నెల్లూరు: కేంద్ర కారాగారంలో ఇప్పటి వరకు 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ సోకింది. తొలుత 52 మందికి సోకగా తాజాగా మరో 20 మంది ఖైదీలకు కరోనా రావడంతో అధికారులు, సిబ్బంది, ఖైదీలు కలవరపడుతున్నారు.
రెండు రోజులుగా కారాగారంలో సంజీవని బస్సు ద్వారా ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలిసారి నిర్వహించిన పరీక్షల్లో 52 మందికి సోకినట్లు నిర్ధారించారు. మలి పరీక్షల్లో 20 మందికి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మొత్తం 72 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని కారాగారం సూపరింటెండెంట్‌ రాజేశ్వర రావు తెలిపారు.

కరోనా సోకిన వారిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌ గదులు కేటాయించినట్లు ఆయన చెప్పారు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడంతో కారాగారం మొత్తం రసాయనాన్ని చల్లించినట్లు తెలిపారు. మరింత విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

You might also like