FbTelugu

ఏపీలో 44 మందికి కరోనా

అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10,240 నమూనాలను పరీక్షించగా 44 మందికి కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కరోనా సోకిన 44 మందిలో 14 మంది చెన్నై కోయంబేడు మార్కెట్ వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. 41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జి అయ్యారు.  రాష్ట్రం లోని నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 2671 కాగా ఇప్పటివరకు 1848 మంది డిశ్చార్జ్ అయ్యారు. 56 మంది కరోనా పాజిటివ్ తో మృతి చెందగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 767.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.