FbTelugu

ఒకే కాలనీలో 35 మందికి కరోనా

యాదాద్రి: రాష్ట్రంలో లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. బీబీనగర్ మండలం ముగ్ధంపల్లిలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.
ఒకే కాలనీకి చెందిన 35 మంది యువకులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. భారీ స్థాయిలో కేసులు నమోదు కావడంతో గ్రామస్థులు షాక్ గురయ్యారు.

బాధిత యువకులు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల క్రితం యువకులంతా కలిసి క్రికెట్ ఆడడంతో వైరస్ సోకిందని వైద్యులు తెలిపారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్క్ పెట్టుకోకుండా ఆటలాడడం మూలంగా వైరస్ సామూహిక దాడి చేసిందని అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లాక్ డౌన్ ఆంక్షలు సడలించారని ఇష్టానుసారంగా తిరిగితే మళ్లీ కేసులు పెరుగుతాయని వైద్యులు హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.