FbTelugu

అన్నవరం గుడిలో 29 మందికి కరోనా

తూ.గో. జిల్లా: అన్నవరం దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 29 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది.

ముందు జాగ్రత్తగా ఆలయ కమిటీ దేవస్థానంలో పనిచేస్తున్న 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించింది. అందులో 29 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో ఆలయ కమిటీ అప్రమత్తమైంది. ఈ నెల 14 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి త్రినాథరావు తెలిపారు. స్వామివారికి నిత్య ఆర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

You might also like