FbTelugu

37మంది హాజరైతే 27 మందికి కరోనా

జగిత్యాల: నిన్న మొన్నటి వరకు కరోనా లేదనుకున్న వారికి మళ్లీ చుక్కలు చూపిస్తున్నది. తాజాగా సిరిపూర్ లో దశదిన కర్మకు హాజరైన వారిలో 27 మందికి కరోనా పాజిటివ్ సోకింది.

బంధువు చనిపోవడంతో ఆయన దశదిన కర్మకు 37 మంది దగ్గరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వారిలో 27 మందికి పాజిటివ్ సోకడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తొలుత ఇద్దరికి లక్షణాలు కన్పించడంతో పరీక్షలు చేసుకున్నారు. వారికి సోకినట్లు తేలడంతో మిగతావారికి స్థానిక వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. మొత్తం 27 మందికి నిర్థారణ కావడంతో సిరిపూర్ లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.