FbTelugu

స్కూలు హాస్టల్ లో 190 మందికి కరోనా

ముంబయి: మహారాష్ట్రను కరోనా వైరస్ వీడేలా కనబడటం లేదు. సెకెండ్ వేవ్ ఆ రాష్ట్రాన్ని పట్టి పీడించేలా ఉంది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. షిర్డీలో రాత్రి సమయాల్లో దర్శనాలు నిలిపివేసి లాక్ డౌన్ విధించారు.

నియంత్రణ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నది. గడచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 8వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యియి. ఒకే రోజులో వైరస్ సోకి 80 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో నమోదు అవుతున్న సగం కేసుల్లో మహారాష్ట్రలో నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. వషిమ్ జిల్లాలోని ఒక స్కూలు హాస్టల్ లో 190 మందికి పాజిటివ్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. వీరిలో 186 మంది విద్యార్థులు కాగా నలుగురు టీచర్లు ఉన్నారు.
స్కూలు ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి రాకపోకలను నిషేధించారు. విద్యార్థులకు అవసరమైన నిత్యావసర సరకులు స్థానిక అధికారులే సమకూర్చుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.