FbTelugu

జీహెచ్ఎంసీలో 180 మంది పోలీసు సిబ్బందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీసులపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో 180 మంది పోలీసు సిబ్బందికి కరోనా సోకింది. పలువురు ఐపీఎస్ అధికారులకు కూడా కరోనా సోకినట్టు సమాచారం.

డీజీపీ కార్యాలయంలో సైతం ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. సహాయకుడికి కరోనా సోకడంతో డీజీ స్థాయి అధికారి, ఇతర అధికారులు హోంక్వారంటైన్ కు వెళ్లారు. ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే 26 మందికి కరోనా సోకింది.

You might also like