FbTelugu

పోలీస్ అకాడెమీలో 180 మందికి కరోనా

హైదరాబాద్: తెలంగాణ పోలీసు అకాడెమీలో (టీఎస్పీఏ) కరోనా అంటే ట్రైనీ పోలీసులు హడలిపోతున్నారు.

అకాడెమీలో మొత్తం 180 మంది కరోనా పాజిటివ్ సోకింది. వీరిలో 100 మంది ట్రైనీ ఎస్సైలు కాగా, 80 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్కరికి కూడా కరోనా లక్షణాలు కన్పించలేదు. అందరికీ అకాడెమీలోనే క్వారంటైన్ ఏర్పాటు చేసినట్లు అకాడెమీ డైరెక్టర్ వికె.సింగ్ తెలిపారు.

ప్రస్తుతం ఈ అకాడమీలో 1100 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 600 మందికి పైగా కానిస్టేబుళ్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సిబ్బంది, పాలనాపరమైన సిబ్బందితో కలిపి మొత్తం 2,200 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. పరీక్షలు నిర్వహిస్తే మరిన్ని పాజిటివ్ కేసులు బయటపడతాయని సిబ్బంది వ్యాఖ్యానించారు.

You might also like