FbTelugu

ఒకే పాఠశాలలో 12 మందికి కరోనా

సంగారెడ్డి: ఒకే పాఠశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా సోకడంతో విద్యాశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. తొలుత ముగ్గురికి సోకగా, ఆ తరువాత మరో 12 మందికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది.

దీంతో పాఠశాల ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఝరాసంగం కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో తొలుత ముగ్గురికి కరోనా లక్షణాలు కన్పించాయి. వారికి రాపిడ్ టెస్టు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. ఆ తరువాత పాఠశాలలో చదివే 150 మంది విద్యార్థులకు రాపిడ్ టెస్టు నిర్వహిస్తే మరో 12 మందికి నిర్థారణ అయ్యింది. మొత్తం 15 మందికి ఆర్టీ పీసీఆర్ టెస్టు నిర్వహించారు. వీరితో పాటు అధ్యాపకులు, సిబ్బందికి కూడా నిర్వహించగా నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి. ముందు జాగ్రత్తగా విద్యార్థులను క్వారంటైన్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.