గవర్నర్ తమిళిసై కు నెగెటివ్
హైదరాబాద్: రాజ్ భవన్ లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. 10 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది.
పది మంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబాల్లోని మరో పది మందికి పాజిటివ్ వచ్చింది. వీరందరినీ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్ కు తరలించారు. ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రిపోర్టులు రావడంతో గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అప్రమత్తమయ్యారు. టెస్టు చేయించుకోగా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో రాజ్ భవన్ లో పూర్తిగా శానిటైజేషన్ చేశారు.