FbTelugu

టెస్లా ప్లాంట్ లో కరోనా కల్లోలం

కాలిఫోర్నియా: బ్రాండ్ ఇమేజీకి దెబ్బపడుతుందని ప్రపంచ కుబేరుడు తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకినా బయటపెట్టలేదు. నష్టాలు వస్తాయని భావించి కార్మికులకు కరోనా వచ్చిందని బయటకు వెళ్లడించకుండా దాచిపెట్టాడు. ఆయనే ఎలాన్ మస్క్.

కాలిఫోర్నియాలోని టెస్లా ప్లాంట్ లో కరోనా వైరస్ వ్యాప్తించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఒక ప్రముఖ న్యూస్ ఏజెన్సీ బట్టబయలు చేసింది. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా మార్చి చివరి నుంచి మే నెల రెండో వారం వరకు ప్లాంట్ ను మూసివేశారు. ఆంక్షలు సడలించడం, ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో ప్లాంట్ ను తిరిగి ప్రారంభించారు. తెరుచుకుని ఉత్పత్తి ప్రారంభమవుతున్న సందర్భంలో పలువురు కార్మికులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ ప్లాంట్ లో మొత్తం 10వేల మంది వరకు పనిచేస్తుండగా 450 మందికి పైగా కరోనా పాజిటివ్ సోకింది. ఈ విషయం బయటకు వస్తే ఉత్పత్తి తగ్గిపోయి, నష్టాలు వస్తాయనే సాకుతో యాజమాన్యం దాచిపెట్టడం విమర్శలకు దారితీస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.