FbTelugu

కరోనా కల్లోలం… తండ్రి చితిపైకి దూకిన కుమార్తె

జైపూర్: కరోనా వైరస్ కుటుంబాల్లో విలయం సృష్టిస్తున్నది. ఆప్తులు చనిపోతుండడంతో తట్టుకోలేకపోతున్నారు. కొందరైతే రోజుల తరబడి మౌనంగా రోదిస్తున్నారు. షాకింగ్ నుంచి చాలా మంది బయటపడలేకపోతున్నారు.
రాజస్థాన్ లో ఒక షాకింగ్ ఉదంతం కలకలం రేపింది. కరోనా పాజిటివ్ సోకిన తండ్రి చూస్తుండంగానే మరణించడంతో తట్టుకోలేని ఆయన కుమార్తె మండుతున్న చితిపై దూకింది. ఈ ఘటన పలువురి కంటతడి పెట్టించింది. బర్మేర్ జిల్లా రాయ్ కాలనీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఈ జిల్లా పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్నది. రాయ్ కాలనీలో దామోదర్ దాస్ (73) కుటుంబం నివాసం ఉంటుంది.

ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవలే దాస్ భార్య కరోనాతో కన్నుమూసింది. అప్పటి నుంచి తండ్రిని ముగ్గురు కుమార్తెలు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు.
స్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాటు చేయగా, చిన్న కుమార్తె శారద (34) చితికి నిప్పంటించారు. అప్పటికే మనో వేదనతో ఉన్న ఆమె కాలుతున్న తండ్రి చితి పైకి దూకేసింది. ఈ హఠాత్పారిణామానికి అక్కడున్న బంధువులు షాక్ కు గురయ్యారు. వెంటనే అక్కడున్న వారు చితి మీది నుంచి ఆమెను కిందకు దించి హుటాహుటిన అంబూలెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆమెను కాపాడే క్రమంలో ఇద్దరు గాయపడ్డారు. వీరిని కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శారదకు 70 శాతానికి పైగా గాయాలయినట్లు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.