FbTelugu

బెజవాడలో తొలి కేసు: జిల్లా కలెక్టర్

విజయవాడ: నగరంలో మొదటి కరోనా పాజిటీవ్ కేసు నమోదైందని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కరోనా పాజిటీవ్ కేసు నమోదైన ప్రదేశంలో దాదాపు 500 ఇళ్ళలో మెడికల్ చెకప్ లు చేశామన్నారు.

మూడు కిలోమీటర్లమేర ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. ఎవరెవరిని కలిశాడో వారిని, ఇంట్లో వారి నమూనాలు సేకరించామన్నారు. ప్రైవేట్ టాక్సీలో వచ్చిన వ్యక్తిని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ప్రైవేట్ క్యాబ్ హైదరాబాద్ నుంచి విజయవాడ, అక్కడినుంచి గుంటూరుకు ముగ్గురు ప్యాసింజర్లను తీసుకెళ్ళారు. అనుమానం ఉన్నవారు మా కంట్రోల్ రూమ్ నంబర్ 7995244260 కు కాల్ చేయాలన్నారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More