FbTelugu

మార్కెట్లను వెంటాడుతున్న కరోనా భయం

రెండు గంటల్లో రూ.4 లక్షల కోట్లు ఆవిరి

ముంబయి: కరోనా సెకండ్ వేవ్ స్టాక్ మార్కెట్లను వెంటాడుతున్నది. ఇవాళ ఉదయం ప్రతికూల పరిస్థితుల్లో ప్రారంభమై మధ్యాహ్నానికల్లా పడిపోయాయి. ఇవాళ దేశ వ్యాప్తంగా నమోదు అయిన ఒక లక్ష పాజిటివ్ కేసులు మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది.

ఈ వార్తలు స్టాక్ మార్కెట్లను మారింత కిందకు దిగజార్చాయి. ఒక దశలో సెన్సెక్స్ 1391 పాయింట్లు కుంగి 49,638 వద్ద ఆగగా, నిఫ్టీ సైతం 388 పాయింట్లు దిగజారి 14,478కి చేరింది. ఐటి షేర్లు రాణిస్తుండగా, బ్యాంకింగ్ రంగ షేర్లు నాలుగు శాతం నష్టాల్లో నడుస్తున్నాయి. కరోనా ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేస్తారనే వార్తల నేపథ్యంలో మార్కెట్ విలువలో ఇవాళ రూ.4 లక్షల కోట్లు ఆవిరయ్యాయి.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.