FbTelugu

యుద్ధాన్ని మించి క‌రోనా భ‌యం!

క‌రోనా వైర‌స్‌. భ‌యోత్పాన్ని సృష్టిస్తుంది. రేప‌టిపై ఆశ‌ను.. బ‌తుకుపై ఉన్న న‌మ్మ‌కాన్ని దూరం చేసింది. యావ‌త్ ప్ర‌పంచం మొత్తం వైర‌స్ విల‌య‌తాండ‌వానికి చిగురుటాకులా వ‌ణ‌కిపోతుంది.

ఎంత‌గా అంటే ఒంట‌రిగా ఉండాలంటే వ‌ణ‌కిపోయేంత‌.. ప‌క్క‌వారితో మాట్లాడితే వైర‌స్ సోకుతుంద‌నే భ‌య‌మేసేంతగా మారారు జ‌నం. ఒంట‌రిత‌నంతో బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేమ‌నే అభ‌ద్ర‌తా భావంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవ‌ల ఇండియాలో విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌పై జ‌రిపిన ఆన్‌లైన స‌ర్వేలో 80శాతం మంది త‌మ బిడ్డ‌ల్ని బ‌డికి పంపేందుకు స‌సేమిరా అంటూ చెప్పారు.

మిగిలిన 20శాతం మంది కూడా అనుమాన‌మే వ్య‌క్తంచేశార‌ట‌. మాన‌సిక ఇబ్బందుల‌కు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన 108 లైన్ ‌కేంద్రాల‌కు వ‌చ్చే ఫోన్‌కాల్స్ ఏకంగా 100 శాతం పెరిగాయ‌ట‌. లాక్‌డౌన్ ఇలాగే కొన‌సాగితే జీవితం ప‌ట్ల ఆస‌క్తి సంగ‌తి ఎలా ఉన్నా ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతాయ‌నే ఆందోళన లేక‌పోలేదు. యువ‌త‌లో రేప‌టి ప‌ట్ల భ‌యంతోపాటు.. చ‌దువు, కెరీర్ ఎలా ఉండ‌బోతుంద‌నే నెగిటివ్ ఆలోచ‌న‌లు చుట్టుముడుతున్నాయ‌ట‌.

పేద వ‌ర్గాల్లో ఆక‌లి తీరితే చాల‌నుకుంటే.. మ‌ధ్యత‌ర‌గ‌తి వ‌ర్గాల్లో మాత్రం రేప‌టిరోజున ఉద్యోగం, పిల్ల‌ల చ‌దువులు, కుటుంబ బాధ్య‌త‌ల గురించి మ‌ద‌న ప‌డుతున్నార‌ట‌. ఇలా.. అట్ట‌డుగు వ‌ర్గాల నుంచి సంప‌న్నుల వ‌ర‌కూ ఏదోఒక అంశంలో మాన‌సికంగా ఒత్తిడి ప‌డుతున్నారు. ఇది తీవ్ర‌రూపం దాల్చ‌క‌ముందుగానే ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే.. క‌రోనా వైర‌స్ వ్యాపించ‌టాన్ని మించిన న‌ష్టం జ‌ర‌గొచ్చ‌నే ఆందోళ‌న లేక‌పోలేదు. ఒక్క‌సారి స‌మాజంలో పానిక్ లక్ష‌ణాలు వ‌స్తే.. క్ర‌మంగా అది నేరాల‌కు దారితీసే అవ‌కాశం లేక‌పోలేద‌నేది పోలీసు వ‌ర్గాల అంచ‌నా. ఎటుచూసినా క‌రోనా త‌రువాత కాలం చాలా క‌ష్టంగా సాగుతుంద‌నేది మాత్రం జ‌గ‌మెరిగిన స‌త్యం.

You might also like