హైదరాబాద్: ప్రతి ఏటా ఇవాళ గురుపౌర్ణమి వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు ప్రజలు. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా భక్తులతో కుక్కిరిసి పోవాల్సిన దేవాలయాలు భక్తులు లేక వెలవెల బోతున్నాయి.
నేడు బాసరలో సరస్వతీ దేవి అమ్మవారికి ఈ వేకువ జామునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా ఇవాళ జరగాల్సిన వేద పండితుల సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రముఖ దేవాలయాల్లోనూ పూజారులు ఏకాంత సేవలే జరిపించారు. ఆలయాల్లోకి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతిస్తున్నారు.