FbTelugu

కరోనా ఎఫెక్ట్…ఆకాశంలోనే పెళ్లి!

చెన్నై: కరోనా మహమ్మారి కారణంగా వివాహాది కార్యక్రమాలు వాయిదా వేసుకున్నా తప్పని పరిస్థితుల్లో పూర్తి చేసుకోక తప్పడం లేదు. ఎవరికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఒక జంట వినూత్న నిర్ణయం తీసుకుని అమలు చేసింది.

మధురై జిల్లా కోరిఫ్పాళ్యం, మధురై కి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు పెళ్లి కోసం ఏకంగా ప్రైవేటు విమానాన్నే బుక్ చేశారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు 161 మంది అతిథులలో విమానం మధురై నుంచి తూత్తుకుడికి బయలుదేరింది. ఈ విమానంలో వధూవరులతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. అందరికీ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించిన తరువాత, నెగెటివ్ రిపోర్టు వచ్చినవారినే ప్రయాణానికి అనుమతించారు. విమానంలోనే పెళ్లి తంతు పూర్తయిన తరువాత విమానం తిరిగి తూత్తుకుడికి చేరింది. వరుడు రాకేశ్ వధువుకు తాళి కట్టిన ఫొటో తమిళనాడులో వైరల్ గా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.