FbTelugu

కరోనా ఎఫెక్టు… కూరగాయల సరఫరా ఆపేశారు…

కృష్ణా: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా బందరు డివిజన్ టాస్క్ ఫోర్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నది.

విజయవాడ నుండి మచిలీపట్నం కు  కూరగాయలు రవాణాను నిలుపుదల చేశారు. బందరు ఆర్డీఓ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ అధికారులు సమావేశమయ్యారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల నూజివీడులో విజయవాడ  నుండి కూరగాయలు తీసుకువచ్చిన ఓ డ్రైవర్ కు కరోనా పాజిటీవ్ రావటంతో అప్రమత్తమయ్యారు.

ఇకపై విజయవాడ నుండి కాకుండా ఏలూరు, అవనిగడ్డ నుండి కూరగాయలు ట్రాన్స్ పోర్టు చేసేందుకు ఏర్పాటులు చేస్తున్నారు. ఈ మేరకు మచిలీపట్నం రైతుబజారు ఎస్టేట్ ఆఫీసర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ వేళ దాతల ద్వారా నిరుపేదలకు ఫుడ్ ప్యాకెట్స్, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీకి కూడా నిలిపివేయాలని నిర్ణయించారు.

మే 1వ తేదీ నుండి పంపిణీ కార్యక్రమాలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. మాంసాహార విక్రయాల్లో కూడా కొత్త ఆంక్షలు విధించారు. కేవలం చికెన్, మటన్ అమ్మకాలకే అనుమతులు ఇచ్చారు. చేపలు, ఇతర మాంసాహారాల విక్రయాలపై పూర్తి నిషేధం విధించారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలు కాదని  నిత్యావసర వస్తువులు అమ్మకాలు చేస్తే షాప్ లు మూసివేయటంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. రెడ్ జోన్ లో నిత్యావసర దుకాణాలు కాకుండా ఏ దుకాణం తెరిచినా చర్యలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ణయించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.