FbTelugu

కరోనా ఎఫెక్ట్… నాలాల క్లీనింగే దిక్కు

ముంబయి: కరోనా మహమ్మారితో దేశంలో నిరుద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. చేస్తున్న ఉద్యోగాలు ఊడిపోవడం, ఉన్నత చదువులు చదివినా పని దొరక్కపోవడంతో లక్షలాది మంది అలమటిస్తున్నారు.
ఉన్నత చదువులు చదవిన విద్యార్థులు కుటుంబం కోసం తమకు సంబంధం లేని పనులు చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ చేసిన వారు ముంబయి మహానగరంలో నాలాలను క్లీనింగ్ చేసే పనులు చేస్తున్నారు.

వర్షాకాలం ప్రారంభంలో బృహన్ ముంబయి నగర పాలక సంస్థ నాలాలను శుభ్రం చేయిస్తుంది. వర్షం పడితే నీరు అడ్డంకి లేకుండా ప్రవహించేందుకు ప్రతి ఏడాది ఈ క్లీనింగ్ పనులు నిర్వహిస్తారు. ఒక ప్రైవేటు సంస్థ కు క్లీనింగ్ చేస పని అప్పగంచగా, ఆ పనుల్లో ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు చేరిపోయారు. డబుల్ గ్యాడ్యుయేట్ అయిన సమీర్ మాట్లాడుతూ, మూడు నెలలుగా ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాని చెప్పాడు. ఎన్నో కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించగా రాలేదని చెప్పాడు. మరో యువకుడు అనిల్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఈ పనిలో కుదిరినట్లు తెలిపాడు. కుటుంబం కోసం ఈ పని చేయడానికి సిగ్గుపడడం లేదని చెప్పాడు. తమ డిగ్రీలు ఈ సమయంలో ఏమాత్రం ఉపయోగపడడం లేదన్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.