FbTelugu

కరోనా ఎఫెక్ట్… గుడి మూసివేత!

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్నది. జాల్నా జిల్లాలో ఒక ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది, భక్తులకు కలిపి మొత్తం 55 మందికి కరోనా సోకింది.
పాజిటివ్ కేసులు నిర్థారణ కావడంతో జిల్లా యంత్రాంగం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. జయదేవ్ వాడిలో జాలీచా దేవీ ఆలయం ఉంది. ఈ ఆలయానికి గ్రామంతో పాటు చుట్టు పక్కల భక్తులు వస్తుంటారు.

ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది అనారోగ్యం బారిన పడడంతో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 55 మందికి కరోనా నిర్థారణ కావడంతో తాత్కాలికంగా ఆలయాన్ని మూసివేశారు. ఆలయం చుట్టు పక్కల ఎవరూ రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి, గ్రామంలో వైద్య శిబిరం కూడా పెట్టారు. ప్రతి ఏడాది జరిగే ఉత్సవాలను కూడా రద్దు చేసినట్లు జిల్లా యంత్రంగం ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.